అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ పట్ల తనకున్న అభిమానాన్ని నిరూపించుకున్నారు. అగ్ర హీరో అయిన నాగార్జునను కలిసేందుకు వచ్చిన ఓ అభిమానిని ఆయన సెక్యూరిటీ గార్డ్ పక్కకు లాగేసిన ఘటన నెట్టింట వైరల్ కావడంతో.. నాగార్జున ఈ ఘటనకు సంబంధించి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం అదే అభిమానిని ముంబైలో నాగార్జున కలిశారు.
ముంబై ఎయిర్ పోర్టులో నాగార్జున సదరు అభిమానిని పలకరించారు. ఆప్యాయంగా హత్తుకున్నారు. అతడితో కలిసి ఫోటోలు దిగారు. తన సెక్యూరిటీ సిబ్బంది లాగేసిన విషయం తనకు తెలియదన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఆయనను పొగిడేస్తున్నారు.
నాగార్జున ప్రస్తుతం కుబేరి సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించే ఈ చిత్రంలో కోలీవుడ్ ధనుష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే తమిళ హీరో కార్తీతో నాగార్జున ఊపిరి చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో బాగా క్రేజున్న ధనుష్‌తో కుబేరలో నాగార్జున కనిపించడంపై ఫ్యాన్స్ ఆయన రోల్ ఎలా వుంటుందోనని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
Nagarjuna met up with the man who was rudely pushed away by his bodyguard earlier.. Nice.. In SM era, nobody can afford such bad PR.. pic.twitter.com/qnLhlWbWlP