హైదరాబాద్‌ను వీడుదాం.. షెడ్లలో ఉందాం : కావూరి

ఆదివారం, 6 జులై 2014 (13:19 IST)
రాష్ట్ర విభజన జరిగి పోయిన తరుణంలో ఇంకా హైదరాబాద్‌లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో, హైదరాబాదు నుంచి పరిపాలించడం సరైంది కాదన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పక్కా భవనాలు లేకపోయినా... తాత్కాలికంగా షెడ్లు వేసైనా సరే సీమాంధ్ర నుంచే పరిపాలన కొనసాగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయాన్ని వెంటనే తేల్చేయాలని కోరారు. ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని, ఇంకా హైదరాబాద్‌లో ఉంటూ మరింత నష్టం చేకూర్చరాదని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి