కాగా, సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరడానికి మంగళవారం అర్థరాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో అఖిలపక్షంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ అయింది.
చర్చలకు పిలవకుండా కార్మికులను భయపెట్టేలా ప్రకటనలు చేస్తున్నారని... ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. భైంసాలో డిపో మేనేజర్ పై జరిగిన దాడికి కార్మికులతో సంబంధం లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.