వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్లు: కేసీఆర్

శుక్రవారం, 29 నవంబరు 2019 (16:55 IST)
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు సీఎం కేసీఆర్. దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నేషనల్ హైవే.. అతీ గతీ లేకుండా.. మెయింటెనెన్స్ లేకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు. 
 
తాను గతంలో పర్యటించిన సమయంలో ఈ సమస్యను ప్రధానంగా గుర్తించామన్నారు. తమకు డబ్బులు ఇవ్వాలని గతంలో మంత్రిగా ఉన్న గడ్కరీని అడిగితే.. కొన్ని నిధులు ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై చర్చించడం జరిగిందని తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి దెబ్బతిన్న రోడ్లను రెండు, మూడు నెలల్లో బాగు చేయిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు