నితిన్ గడ్కరీతో కేశినేని నాని సమావేశం.. ఎందుకో తెలుసా?

శనివారం, 15 ఆగస్టు 2020 (21:08 IST)
విజయవాడ ఎంపీ కేశినేని నాని రహదారులు మరియు రవాణా శాఖా కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. 
 
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కనకదుర్గా ఫ్లైఓవర్ పనుల పూర్తి వివరాలను తెలియజేశారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ మరియు నందిగామ-కంచికచర్ల హైదరాబాద్ రహదారి, విజయవాడ-బందరు రహదార్ల, తిరువూరు-విజయవాడ రహదారి నిర్మాణ పనులలో నితిన్ గడ్కరీ చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు. 
 
గడ్కరీ చూపిన శ్రద్ధ వల్లనే ఈ రోజు ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు వచ్చాయని, విజయవాడ అభివృద్ధికి మరింత సాయం చేయాలని కోరారు. కొన్ని దశాబ్దాలపాటు విజయవాడ నగర వాసులు దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ ఇక్కట్లు పడ్డారు. 
 
విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని దుర్గగుడి ఫ్లై ఓవర్ విషయంలో చాలా సీరియస్ గా ముందుకు కదిలి…  ఫ్లైఓవర్ పనులు మొత్తం పూర్తి చేయడం జరిగింది. 
 
ఈ ఫ్లైఓవర్ పనులు కంప్లీట్ కావడంతో దాదాపు విజయవాడ నగరంలో 50 శాతం ట్రాఫిక్ క్లియర్ అయిపోయినట్లే అని నగర వాసులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు