టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు
శుక్రవారం, 18 జూన్ 2021 (07:38 IST)
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది.
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది.
రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.