మంత్రి రోజాకు కిరణ్ రాయల్ వార్నింగ్.. 18 నెలల తర్వాత ఇదే స్టేషన్‌లో కూర్చోబెడతా...

ఆదివారం, 13 నవంబరు 2022 (12:18 IST)
ఏపీ మంత్రి ఆర్.కె. రోజాకు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా 18 నెలల తర్వాత ఇదే పోలీస్ స్టేషన్‌లో రోజాను కూర్చోబెడతానంటూ హెచ్చరించారు. తనను ఏ స్టేషన్‌లో అయితే కూర్చోబెట్టారో అదే స్టేషన్‌లో మంత్రి రోజాను 18 నెలలు తిరగే లోగానే కూర్చోబెడతానని ఆయన అన్నారు.
 
ఈ మేరకు శుక్రవారం రాత్రి అరెస్టు అయిన కిరణ్ రాయల్ శనివారం మధ్యాహ్నానికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీ తిరుపతి అధ్యక్షుడు హరిప్రసాద్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చి, మంత్రి రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
తన అరెస్టుతో మంత్రి రోజాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలో కారణమని ఆరోపించారు. శుక్రవారం తనను తన ఇంటిలో అరెస్టు చేస్తున్న సందర్భంగా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఓ ఉగ్రవాది కంటే కూడా దారుణంగా తనను పోలీసులు ట్రీట్ చేశారన్నారు. అరెస్టు సమయంలో దారుణంగా ప్రవర్తించిన పోలీసులతో పాటు రోజా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తానని ఆయన హెచ్చరించారు. 

 

#kiranroyal Mass warning @RojaSelvamaniRK @JanaSAInikBvrm @YoursSatya pic.twitter.com/f54LBwL7Gm

— тяινιкяαм ︻デ═一 (@Trivikram_Pavan) November 12, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు