చంద్రబాబు దళారీ, బ్రోకర్, దుర్మార్గుడు, పెద్ద బిచ్చగాడు: కొడాలి నాని తిట్ల పురాణం

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:14 IST)
గుడివాడ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తిట్ల పురాణం అందుకున్నారు. ఆయన దళారీ, బ్రోకర్, దుర్మార్గుడు, పెద్ద బిచ్చగాడు అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
 
1) రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుకు.. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది. ఆనాడు వైయస్‌ఆర్‌ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని అంటే, కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ అవహేళనగా చంద్రబాబు మాట్లాడిన విషయం గుర్తులేదా..? ఈరోజు వైయస్‌ఆర్‌ తనయుడు వైఎస్ జగన్ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను వ్యవస్థీకృతం చేసేందుకు కృషి చేస్తుంటే, దానిపైన చంద్రబాబు విషం చిమ్ముతున్నాడు.
 
- రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని, విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ.. సీఎం కాగానే మొదటి సంతకం చేసిన  మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు.  ఆయన పేరును పదికాలాల పాటు నిలబెట్టేలా.. నేడు సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం వున్నా, లేకపోయినా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ ఒక పద్దతి ప్రకారం నిరంతరం అందాలన్న లక్ష్యంతో  ముందుకు సాగుతున్నారు. 
 
2) రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. తద్వారా యూనిట్‌ కరెంటు రూ.2.5లకే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. 

- ఇప్పటి వరకు రైతులకు అందిస్తున్న విద్యుత్‌ కోసం యూనిట్‌ రూ.6 వరకు చెల్లిస్తున్నాం.  ఏడాదికి దాదాపు రూ.8వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్తు కోసం ఖర్చు అవుతుంది. దీనికయ్యే పూర్తిబాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. 
- ఫలితంగా ప్రభుత్వంపై ప్రస్తుతం చెల్లిస్తున్న దానిలో సగం వరకు భారం తగ్గుతుంది. రైతులు, డిస్కమ్‌, ప్రభుత్వం ఒక అగ్రిమెంట్‌తో ప్రతినెలా రైతు కనెక్షన్‌కు మీటరు పెట్టి ఎంత కరెంట్ వాడుకున్నాడో ఆ బిల్లును ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లిస్తుంది. ఒక్క రూపాయి కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేదు.
 
3) ఈ విధానం అమలులోకి వస్తే ప్రతిరోజూ పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ రైతుకు అందుతుంది. దీనికోసం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలెట్ ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టాం. ఏప్రిల్ లోపు దానిని పూర్తి చేసి, రైతులకు చేరువ చేస్తాం. దాని నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌తో రాష్ట్రం అంతా కూడా దానిని అమలు చేయబోతున్నాం. 
 
4) రైతుల గురించి ఇంతగా సీఎం వైయస్ జగన్ ఆలోచిస్తుంటే, చంద్రబాబు దీనిపైన కూడా బురదజల్లుతున్నాడు. తాను అధికారం నుంచి వెళ్ళిపోయే సమయంలో ఎనిమిది వేల కోట్లు రైతులకు విద్యుత్ బకాయిలు పెట్టి వెళ్ళిన ప్రబుద్ధుడు చంద్రబాబు. ఇలాగే ప్రతిసారీ అధికారం మారినప్పుడల్లా డిస్కమ్‌లకు వేల కోట్లు రైతుల విద్యుత్‌ బకాయిలు పెట్టిపోతే, డిస్కమ్‌లు ఆర్థికంగా కుదేలైతే, అంతిమంగా రైతులే నష్టపోతారు.

దీనిని పూర్తిగా సరిదిద్దేందుకు, శాశ్వతంగా రైతులకు అందే విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా వుండాలనే సీఎం  వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. 
 
5) రాష్ట్రంలో జరిగే ఈ మంచిని చంద్రబాబు సహించలేక, తనకు బాకా ఊదే మీడియాల ద్వారా రైతులకు నష్టం జరిగిపోతోందనే అసత్య ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు ఒక దళారీ, బ్రోకర్. హెరిటేజ్ పేరుతో పేడ, పాలు, పెరుగు అమ్ముకోవడంతో పాటు రైతులు పండించిన వాటిని కూడా తక్కువ ధరకు కొని, హెరిటేజ్ బ్రాండ్ పేరుతో ఎక్కువకు అమ్మకుంటున్న బ్రోకర్.

కరోనాకు భయపడి పక్కరాష్ట్రంలో వుండి, ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని అనుకుంటన్నాడు. చంద్రబాబును, ఆయనకు బాకా ఊదే మీడియాను ప్రజలు నమ్మరు. వైయస్ జగన్ పట్ల రైతులు పూర్తి విశ్వాసంతో వున్నారు. 
 
6) రైతన్నలకు అండగా ముఖ్యమంత్రి జగన్ గారు రైతుభరోసా కింద ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయం, తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్, ఆర్బీకెల ద్వారా గ్రామాల్లోనే రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా ప్రచారంను, వాళ్ళు చేస్తున్న కృత్రిమ ఉద్యమాలను రైతులు నమ్మె పరిస్థితిలో లేరు.  
 
7) నిన్న సీఎం వైయస్‌ జగన్ ను చంద్రబాబు హెచ్చరించడం హాస్యాస్పదంగా వుంది. అచ్చెన్నాయుడిని హింసించారంటూ చంద్రబాబు వాపోతున్నాడు. అసలు అచ్చెన్నాయుడిని ఎవరైనా హింసించగలరా? కార్మికులకు ఇవ్వాల్సిన మందుల విషయంలో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడి, అరెస్ట్ అయ్యాడు. ఆయన ఇప్పటి వరకు 78 రోజులు కస్టడీలో వుంటే, అందులో ఫైల్స్ చికిత్స పేరుతో 70 రోజులు ఆసుపత్రిలోనే వున్నాడు.

కేవలం ఆరేడు రోజులు మాత్రమే ఆయన జైలులో వున్నాడు. ఈ భూప్రపంచంలో  ఫైల్స్ చికిత్సకు 70 రోజులు ఆసుపత్రిలో ఎవరైనా వుంటారా? మాకే కక్ష సాధింపు ఉద్దేశం వుంటే... మరోలా ఉండేది.  మేం చాలా సహనంతో వ్యవహరించాం. అచ్చెన్నాయుడు గురించి సీఎం జగన్ గారు అసలు పట్టించుకోరు. 
 
8) చంద్రబాబు తాను అధికారంలోకి వస్తానని కలలు కంటున్నాడు. ఇప్పటికే 76 ఏళ్ళ వయస్సున్న చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేయగలడు. ఎన్నిసార్లు మళ్లీ అధికారంలోకి రాగలడు? తన అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని భావిస్తున్నా ఆయనను నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరు. చివరికి విజయవాడకు వచ్చినా కూడా కరోనా భయంతో అంతరిక్షం నుంచి వచ్చినట్లుగా చంద్రబాబు అవతారం వుంది.

దోమలపై దండయాత్ర చేసిన చంద్రబాబు కరోనాపై ఎందుకు దండయాత్ర చేయడం లేదు? హుద్‌హుద్ కు ఎదురెళ్ళానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కరోనాకు ఎందుకు ఎదురెళ్లడం లేదు? ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రతి చర్యను విమర్శిస్తున్న చంద్రబాబు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.
 
9) దేవినేని ఉమ.. అక్కాయ్ కబుర్లు చెబుతున్నాడు. తాను మైసూర్ మహారాజులాగా, అంతరిక్షం నుంచి ఇప్పుడే భూమిపైకి దిగివచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కంచికచర్లలో క్రాంతి కూల్ డ్రింక్‌ పేరుతో దేవినేని తండ్రి సోడాలు అమ్ముకునేవాడు. తండ్రి కొట్టిన సోడా కాయలను దేవినేని ఉమ కడిగేవాడు. అటువంటి దేవినేని ఉమ నన్ను గురించి మాట్లాడుతున్నాడు. నన్ను బూతుల మంత్రి అంటున్నాడు. నేను నిజంగా బూతులు తిడితే చంద్రబాబు, దేవినేని ఉమ బతికి వుంటారా? 

- నేను లారీ డ్రైవర్, క్లీనర్‌ గా పనిచేశానని ఉమ మాట్లాడుతున్నాడు. గుడివాడలో మాకు వందకు పైగా సొంత లారీలు, బస్సులు వున్నాయి. పదేపదే లారీ డ్రైవర్, క్లీనర్ అంటూ వారిని తక్కువచేసేలా దేవినేని ఉమ మాట్లాడితే లారీ డ్రైవర్లు, క్లీనర్లు సహించరు. 
 
10) నాకు రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైయస్‌ఆర్‌ కుటుంబాలు. ఆ కుటుంబాలకు నేను విధేయుడుగా వుంటాను. అంతేకానీ చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని వుండాల్సిన అవసరం నాకు లేదు. చంద్రబాబుకే ఇందిరాగాంధి, ఎన్టీఆర్‌లు రాజకీయ బిక్ష పెట్టారు. అధికారం కోసం చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ను చంపితే,  దేవినేని ఉమ తన వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చాడు. అటువంటి మీ వద్ద నేను రాజకీయాలు నేర్చుకోవాలా?

అందరికంటే పెద్ద బిచ్చగాడు చంద్రబాబే. అమరావతి పేరుతో జోలె పట్టుకుని అడుక్కున్నాడు. వైయస్ జగన్ రెండు సార్లు నాకు సీటు ఇచ్చి, ఎమ్మెల్యేను చేశాడు. జగన్ గారి దయ వల్లే నేను మంత్రిగా వున్నాను. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు