ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్ బాబు కుమారుడు రోహిత్‌సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.
విద్యార్థికి వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్‌లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను తండ్రి నిలదీయడంతో స్కూల్ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు. చివరకు ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో వివాదాస్పదమైంది.