భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణకు మూడు టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు ఆరు టీఎంసీలు తాగునీటికి కోసం అవసరం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 34.24టీఎంసీలు మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.