రిషబ్ శెట్టి ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. యాక్షన్ సీన్స్‌లో నెక్స్ట్ లెవల్‌లో కనిపించారు. యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ అద్భుతంగా కనిపించింది. రిషబ్ శెట్టి, రుక్మిణి ప్రేమ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
దర్శకుడిగా రిషబ్ శెట్టి అద్బుతాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. అరవింద్ ఎస్ కశ్యప్ కెమరా వర్క్ మార్వలెస్ గా వుంది. బి అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎమోషన్ ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్ డిజైనర్ వినేశ్ బంగ్లాన్ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. హోంబలే ఫిలింస్ ప్రొడక్షన్ వాల్యూస్ వరల్డ్ క్లాస్ లో వున్నాయి.
విజువల్ వండర్ గా నిలిచిన కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.