ఈ ఓటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన సొంత పార్టీ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ నెల 13న జరగనున్న ఓటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని సదరు నోటీసుల్లో సోనియా పార్టీ ఎంపీలను ఆదేశించారు.