నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనాలకు శంకుస్థాపన

సోమవారం, 13 డిశెంబరు 2021 (11:32 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం గ్రౌండ్‌ఫోర్ కాకుండా మరో ఐదు అంతస్తులతో కూడిన భవనం నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా చేస్తారు. 
 
కాగా, ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు కొనసాగించేందుకు సాధ్యపడటం లేదు. దీంతో కొత్త భవనం నిర్మించాలని హైకోర్టుతో పాటు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది. దీంతో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి చీఫ్ జస్టీస్ పీకే మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, సీఆర్డీఏ అధికారులు హాజరుకానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు