అత్యంత కీలకమైన జనసేన పార్టీ న్యాయ విభాగం బాధ్యతలను తన మీద నమ్మకంతో అప్పగించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రతాప్ కృతజ్ణతలు తెలిపారు. వకీల్ సాబ్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించారని, రాజకీయాలను సామాన్యుడికి చేరువ చేయాలన్న ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయ విభాగాన్ని తీర్చిదిద్దుతానంటున్నారు ప్రతాప్.