నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు... పదో తేదీ నుంచి అమలు

గురువారం, 3 అక్టోబరు 2019 (11:51 IST)
తిరుపతి - సికింద్రాబాద్ లింగంపల్లి ప్రాంతాల మధ్య తిరిగే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ రైలు లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ మార్చిన వేళలు ఈ నెల పదో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రైలు పదో తేదీ నుంచి ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుందని సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. 
 
సాయంత్రం 5:50 గంటలకు బేగంపేట, 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. బీబీనగర్‌ 6:49 గంటలకు, 7:30 గంటలకు రామన్నపేట, 7:40కి చిట్యాల, 8 గంటలకు నల్గొండ చేరుకునే రైలు.. 9:47కు సత్తెనపల్లి, 11 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 
 
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు. ఈ నెల పదో తేదీ నుంచే ఈ వేళలు అమల్లోకి వస్తాయని, ప్రయాణికులు గుర్తించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు