గురువారం తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు, వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో 23న (గురువారం) ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసే ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.