ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో పరిస్థితి రోజు రోజుకు మారిపోతుంది. కరోనా తీవ్రత ప్రజల తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో కరోనా తీవ్రత అధికంగా ఉందని, ప్రజల సహకారంతోనే కరోనా జయించగలుగుతామని అన్నారు.