లోకేష్ జూమ్ మీటింగ్ - షాకిచ్చిన వైకాపా నేతలు

గురువారం, 9 జూన్ 2022 (16:00 IST)
ఇటీవల ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువగా ఉంది. దీనిపై విపక్షాలు అనేక రకాలైన విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధానంగా అసమర్థ పాలన వల్లే ఈ తరహా ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం జూమ్ మూటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్‌లో వైకాపా నేతలు ఎంట్రీ ఇచ్చి నారా లోకేష్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
మాజీ మంత్రి కొడాలి నాని, వైకాపాలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీలతో పాటు వైకాపానేత దేవేందర్ రెడ్డిలు వచ్చాయి. వారు నారా లోకేష్‌కు పలు ప్రశ్నలు సంధించేందుకు ప్రయత్నించగా, తొలుత ఆడియో ఆ తర్వాత వీడియో కట్ అయింది. మీరు చేసేది కరక్టేనా, విద్యార్థులతో రాజకీయం చేస్తారా అని దేవేందర్ రెడ్డి నారా లోకేష్‌ను ప్రశ్నించగా, ఆ లోపే ఆడియో, వీడియో కట్ అయింది. ఆ వెంటనే లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
విద్యార్థులతో పవిత్ర కార్యక్రమం చేస్తుంటే జూమ్‌లోకి వచ్చి ఇలా మాట్లాడుతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలు జూమ్ మీటింగ్‌లోకి వచ్చినట్టుగా చూపించే స్క్రీన్ షాట్‌లను నారా లోకేష్  రిలీజ్ చేశారు. కేవలం రాజకీయం చేయడానికే వైకాపా నేతలు తమ జూమ్ మీటింగ్‌లోకి వచ్చారని ఆయన ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు