ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగట్లేదు.. ఎంట్రన్స్ ఫీజులా మారింది: జేపీ

గురువారం, 9 జనవరి 2020 (11:05 IST)
ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగటం లేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఎన్నికల్లో డబ్బులివ్వడమనేది.. ఎంట్రన్స్ ఫీజులా మారిందని అభివర్ణించారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా నాయకులు ఓట్లను అభ్యర్థించాలని, ధన ప్రవాహాన్ని ఆపాలన్నారు. ఎన్నికల కోసం వేలకోట్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు.
 
ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై ఎన్నికల భారాన్ని తగ్గించడంపై గురు,శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకే మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలు భరించాల్సిన భారాన్ని పార్టీలు భరిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని నిరోధించడానికి ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానం మేలని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు