ఇటీవల ఏపీ హక్కుల సాధనలో భాగంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీలో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. పవన్ సూచన మేరకు కమిటీలో పాల్గొని తన సలహాలు, సూచనలు ఇచ్చారు.
అయితే, పవన్, జేపీల మధ్య ఇప్పటికే ఓ అవగాహన కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి జయప్రకాష్ పోటీ చేయమని పవన్ కళ్యాణే స్వయంగా కోరారట. ప్రజల సమస్యలను బాగా తెలిసిన వ్యక్తి.. అధికారం కోసం కాదు.. ప్రజల కోసమే అన్న విధానంతో ముందుకు వెళుతున్న వ్యక్తులో జయప్రకాష్ నారాయణ్ ఒకరు కావడంతో ఆయనంటే పవన్‌కు ఎంతో ఇష్టం.
అందుకే ఎంపీగా పోటీకి జయప్రకాష్‌ను ఓకే చేశారు. కానీ జయప్రకాష్ నారాయణ్‌కు మాత్రం పోటీ చేయాలన్న ఆలోచన ఏ మాత్రం లేదని ఆయనే స్వయంగా చెబుతున్నారు. నేను ఎంపిగా నిలబడితే నాకెవరు ఓటేస్తారు.. అంటూ తన మనస్సులోని మాటను ఆయన తేటతెల్లం చేశారట. కానీ, పవన్ మాత్రం జేపీని బరిలోకి దింపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.