రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

దేవీ

శుక్రవారం, 29 ఆగస్టు 2025 (18:41 IST)
Roshan Kanakala, Mowgli
బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ గా డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల, తన అప్ కమింగ్ మూవీ మోగ్లీ 2025 లో పూర్తిగా భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025,  పోస్టర్లు, పుట్టినరోజు స్పెషల్ గ్లింప్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది.
 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ది వరల్డ్ ఆఫ్ మోగ్లీ  గ్లింప్స్ ను లాంచ్ చేశారు. గ్లింప్స్ నాని వాయిస్ తో ప్రారంభమవుతుంది. 2025 లో అటవీ నేపథ్యంలో జరిగే ప్రేమకథను అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఒక యువకుడు గ్యాంగ్ స్టర్, స్మగ్లర్ గా కాకుండా, ప్రేమికుడిగా 30 మందిని పరిగెత్తిస్తాడనే నెరటివ్ చాలా ఆసక్తికరంగా ఉంది.
 
దర్శకుడు సందీప్ రాజ్ ప్రేమకథను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెష్ విజువల్స్, హత్తుకునే ఎమోషన్స్ తో అద్భుతంగా చూపించారు. హీరో పట్టణ జీవితంతో పరిచయం లేనివాడు కానీ అడవిలో మాత్రం తనకి తిరుగులేదు. నాని వాయిస్ ఓవర్ కథనానికి మరింత డెప్త్ ని యాడ్ చేసింది
 
రోషన్ కనకాల రగ్గడ్ ఇంటెన్స్ అవాతర్ లో అదరగొట్టాడు. అతను గుర్రంపై దూసుకెళ్లే విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. బండి సరోజ్ కుమార్ విలన్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, రోషన్ లవర్ గా సాక్షి మడోల్కర్ అద్భుతంగా కనిపించింది. వారి కెమిస్ట్రీ, లిప్-లాక్ సీక్వెన్స్ ఇంటెన్స్ లవ్ స్టొరీని ప్రజెంట్ చేస్తున్నాయి. హర్ష చెముడు కీలక పాత్రలో కనిపించారు
 
సినిమాటోగ్రాఫర్ రామ మారుతి అద్భుతమైన విజువల్స్ అందించగా, కాలా భైరవ పవర్ ఫుల్ మ్యూజిక్ ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది.  నిర్మాణ విలువలు గ్రాండ్ స్కేల్ లో వున్నాయి.
 
ఈ చిత్రానికి కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా, కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. నటరాజ్ మాదిగొండ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. అద్భుతమైన కథనంతో మోగ్లీ 2025 ఒక ఇంటెన్స్, ఎమోషనల్ ప్రేమకథని ప్రామిస్ చేస్తోంది. ఈ గ్లింప్స్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఆడియన్స్ అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు. చరణ్ గారు మా అందరికీ స్ఫూర్తి. ఆయన మా గ్లింప్స్ లాంచ్ చేయడం హానర్ గా భావిస్తున్నాం. నేచురల్ స్టార్ నాని అన్న తన వాయిస్ ఓవర్ తో మా కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వ ప్రసాద్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. మా సినిమాకి కూడా ఎంతో పాషన్ తో ఏ లోటు లేకుండా చూసుకున్నారు. సందీప్ ఈ సినిమాతో ఒక మ్యాడ్ నెస్ క్రియేట్ చేశా.రు మీరందరూ కూడా విట్నెస్ చేయబోతున్నారు. మీ అందరి కోసం ఒక అద్భుతమైన సినిమాని చేశాము. మీరందరూ చూస్తారని కోరుకుంటున్నాను.  
 
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్యూ. వాయిస్ ఓవర్ ఇచ్చిన నాని గారికి థాంక్ యూ.   కేఎల్ యూనివర్సిటీకి థాంక్యూ. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక సబ్జెక్టుగా ఉందని విన్నాను. తప్పకుండా యంగ్ టాలెంట్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు