వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలోని తుప్రాన్‌లో మండలం, పడాల్‌పల్లి గ్రామానికి చెందిన మౌనిక(20) స్థానిక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతుంది. మేడ్చల్ కు చెందిన నగేష్(24) స్తానికంగా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్న వీరిద్దరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.