వివరాల్లోకి వెళితే.. ఈశ్వర్‌నగర్‌లో శివప్రసాద్, స్వప్న అనే యువతి యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకుంటామంటే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమజంట పోలీస్ స్టేషన్‌లో వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం శివ నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన కుమార్తెను హత్య చేసి ఉరేశారని, శివ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నాడని స్వప్న తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. శివ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.