ఓ మొబైల్ షాపు మెకానిక్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తీసుకున్న అప్పు చెల్లించని అడిగిన పాపానికి తన చేతిలో ఉండే స్క్రూడ్రైవర్‌తో అప్పిచ్చిన వ్యక్తి గుండెల్లో పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం విజయవాడ చిట్టినగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
చిట్టినగర్‌కు చెందిన గ్రంధి వెంకటరంగారావు అనే వ్యక్తి తన సెల్‌ఫోన్‌ను అమ్మిపెట్టాలని తాజ్ అనే మెకానిక్‌కు ఇచ్చాడు. దీంతో ఈ ఫోనును ఫోన్‌ను రూ.5 వేలకు విక్రయించాడు. అయితే, తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని, ఈ రూ.5 వేలతో పాటు.. అదనంగా మరో రూ.4 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో వెంటకరంగారావు రూ.4 వేలు కూడా తాజ్ అప్పుగా ఇచ్చాడు.
ఈ అప్పును తిరిగి చెల్లించాలని ఆదివారం తాజ్‌ను వెంటకరంగారావు అడిగారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికిలోనైన తాజ్... తన చేతిలో ఉన్న స్క్రూడ్రైవర్‌తో వెంకటరంగారావు ఛాతిలో పొడిచి పారిపోయారు. గాయపడిన వెంకటరంగారావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు తాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.