Allari Naresh released Vidrohi Trailer
రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా విద్రోహి. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.