అదే బిల్డింగ్‌లో ఉంటున్న యువతిపై అతడి దృష్టి పడడంతో ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా అనుసరించేవాడు. ఆమెను ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. పెళ్లికి చేసుకోమని ఒత్తిడి చేశాడు. అయితే సదరు యువతికి ఈ నెల 2న మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలిసిన దుర్గాప్రసాద్ జీర్ణించుకోలేకపోయాడు.
ఆదివారం నేరుగా ఆమె ఇంటికి వెళ్లి గొడపడ్డాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తెరతో దాడి చేశాడు. దీంతో యువతి చెవి, గొంతుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు.