గురువారం నాడు సిద్ధిపేటలో ఓ వివాహం కోసం వచ్చిన మధు సుస్మితకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. అప్పటికే తన వెంట కూల్ డ్రింక్, పురుగుల మందును తెచ్చిన మధు, చనిపోయి ఒకటవుదామని తెలిపాడు. కానీ సుస్మిత ఎంతమాత్రం అంగీకరించకపోవడంతో మధు ఉన్మాదిగా మారిపోయాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు.