అయితే, భానుచందర్ భార్యకు ఏడో తరగతి చదువుతున్న 12 యేళ్ల చెల్లి ఉంది. ఈమెపై కన్నేసిన ఆ కామాధుడు.. మాయమాటలు చెప్పి ఆ బాలికను లొంగదీసుకుని, అత్యాచారం చేయసాగాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తిడతారని బాలిక మౌనంగా భరిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో ఆ బాలికకు శారీరక సమస్యలు తలెత్తడం, వాంతులు చేసుకుంటుండటంతో బాలికను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి బాలిక గర్భిణి అని తేల్చారు. అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరం అని.. అబార్షన్‌కు యత్నించినా బాలిక ప్రాణానికి ప్రమాదం అని వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను విచారించి భానుచందరే నిందితుడని తెల్చారు. అతడిని అదుపులోకి తీసుకుని ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు.