'కలెక్షన్ కింగ్' మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. మొదటగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో ప్రారంభం కాబోతున్న తన సినిమాని గురించి వెల్లడించిన ఆయన... తర్వాత ఓటు హక్కుకు గల ప్రాధాన్యతను గురించి వివరించడం ఆసక్తికరంగా సాగింది.