ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్ట్ అగ్రనేత భార్య

శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:37 IST)
విశాఖపట్నం జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొందరు ప్రాణాలతో పట్టుబడినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది.

మావోయిస్టుల అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసులు అదుపులో ఉన్నారు. ఏజెన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో అరుణ గాయపడ్డారు. ఈ క్రమంలో గాయాలతో ఉన్న అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పూర్తయిన అనంతరం అరుణను మరింత విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ నవాంగ్‌ ఇటీవల ఆకస్మికంగా విశాఖపట్నం పర్యటనకు వచ్చారు. బీచ్‌రోడ్డులోని పోలీస్‌ మెస్‌లో బస చేసిన ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా, విశాఖ డీఐజీ వీఎల్‌కే రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

కొద్దిరోజుల క్రితం విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా అప్రమత్తంగా వుండాలని, మావోలు ఎదురుదెబ్బతీసే అవకాశం వున్నందున కూంబింగ్‌కు వెళ్లే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. 24/7 గస్తీ ఉండాలని ఆయన సూచించారు.
 
విశాఖ మన్యంలో కొనసాగుతున్న కూంబింగ్
బురదకోట విలేజ్ లో గాయాలతో స్పెషల్ పార్టీకి మావోయిస్ట్ నేత సాకె కళావతి అలియాస్  భవాని పట్టుబడింది. మావోయిస్ట్ ఏరియా కమిటి మెంబర్ గా పనిచేస్తున్న సాకె కళావతి అలియాస్ భవాని. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో కళావతి పనిచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు