నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ ఆదివారం షాప్స్ బంద్

శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (14:19 IST)
నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ లో నివసించే ప్రజలు మాంసాహారాన్ని రుచి చూడలేరు. ఏప్రిల్ 25వ తేదీ ఆదివారం నాడు మాంసం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ ఆదివారం నాడు మూసేయాల్సిందిగా జీహెచ్ఎంసీ గురువారం ఓ ప్రకటన చేసింది. 
 
మహవీర్ జయంతి సందర్భంగా ఆదివారం నాడు మద్యం దుకాణాలు బంద్ చేయాల్సిందిగా సూచించింది. దుకాణాదారులు అంతా ఈ నిబంధనలు పాటించేలా వెటర్నరీ విభాగం అధికారులు చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. 
 
కాగా.. ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో నాన్ వెజ్ ప్రియులు మాంసం దుకాణాల ముందు క్యూ కడుతుంటారు. రోజు వారీ కూలి చేసుకునే కుటుంబం అయినా సరే, ఆదివారం నాడు మాంసం ముద్ద తినేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఆదివారం చికెన్ ముక్కను నోటబెట్టే ఛాన్స్ వుండదు మరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు