రాష్ట్రానికి విదేశాల నుంచి 29వేల మంది వచ్చారు. మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నాం. ప్రత్యేకంగా నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయవాడలో ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఆస్పత్రుల్లో 2వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే ఉంటుంది.
ప్రతి నియోజకవర్గంలోనూ క్వారంటైన్ సెంటర్లు పెడుతున్నాం. ఇప్పటివరకు 312 మంది శాంపిళ్లను పరీక్షలకు పంపించాం. 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది, 62 మంది రిపోర్టుల నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రోజు 13 మంది శాంపిల్స్ పరీక్షలకు పంపించాం. ఏపీలో విదేశాల నుంచి వచ్చిన 12,177 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాము.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో భారీగా క్వారంటైన్ వార్డుల ఏర్పాటు. జిల్లా కేంద్రాలు, సబ్ డివిజన్ స్థాయిలో 17,837 ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉంచాం. విశాఖ ఎయిర్‌పోర్టు, గంగవరం, క్రిష్ణపట్నం పోర్టులలో ప్రయాణికులకు స్క్రీనింగ్ ఉంటుంది’ అని వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు.