ట్రాన్స్‌పరెన్సీ కోసమే ఆన్‌లైన్ టిక్కెట్ విధానం : మంత్రి పేర్ని నాని

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (17:08 IST)
సినిమా టిక్కెట్ల విక్రయంలో పారదర్శకతను పాటించేందుకే ఆన్‍‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి సినీ వర్గాలు సంపూర్ణ మద్దతు తెలిపాయన్నారు. 
 
సోమవారం సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారని తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల విక్రయ ఇస్తామని ప్రకటించారు. 
 
పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని పేర్ని నాని తెలిపారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దిల్ రాజు, డివివి దానయ్య, రామ సత్యనారాయణ, ముత్యాల రామదాసులతో పాటు పంపిణీ దారులు, థియేటర్ యజమానులు ఈ భేటీకి హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు