ద్విచక్రవాహనంపై మంత్రి పర్యటన

శనివారం, 16 నవంబరు 2019 (18:35 IST)
ప్రజలకు సేవ చేసేందుకే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం మంత్రి ద్విచక్రవాహనంపై విజయవాడలో సుడిగాలి పర్యటన చేశారు. 
 
నగర అభివృద్ధికి  మరియు ప్రజలకు కావలసిన అవసరాలు తెలుసుకోవడానికి మంత్రి సామాన్యుని వలె ద్విచక్రవాహనంపై పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
 
స్థానికులతో కలిసి రోడ్డు పక్కన టీ బంకులో టీ తాగి వారితో కాసేపు ముచ్చటించారు. వారి సాధిక బాధలు వారి అవసరాలు మరియు నగర అభివృద్ధికి కావాల్సిన సలహాలు తీసుకున్నారు..
 
తొలుత మంత్రి  బ్రాహ్మణ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్, సొరంగం ప్రాంతం, భవానిపురం, ఊర్మిళ నగర్, కామ కోటి నగర్, జోజీ నగర్, హెచ్ బి కాలనీ, శివాలయం వీధి, తదితర ప్రాంతాలలో పర్యటించారు.
 
పర్యటనలో మంత్రితో పాటు నగర పాలక సంస్థ అధికారులు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు