సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లక్కర్లేకుండా, ఎఐఆర్ నమోదు చేయాల్సిన పని లేకుండా కేవలం వాట్సప్ మెసేజ్ చేస్తే చాలు.. పోగొట్టుకున్న ఫోనును రికవరీ చేసి, అందజేస్తారు.
అందులో గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. దానిలో జిల్లా, పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, పోయిన ఫోన్ మోడల్, ఐఎంఈఐ నంబర్, మిస్సయిన ప్రాంతం తదితర వివరాలను నమోదు చేయాలి.
అయితే, ఈ చాట్ బాట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచీ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.