ఎన్టీఆర్ జయంతి రోజున హరికృష్ణ సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు, టాలీవుడ్ యువ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ఓ ఆటం బాంబు అని ప్రకటించారు. పైగా, ఆ బాంబు పేలిన రోజున అంతా మటాషై పోతారంటూ వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో జరిగిన తానా ఉత్సవాల్లో ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న అవార్డ్స్ వేడుకకు కల్యాణ్ రామ్ హాజరయ్యారు. ఆయనకు నందమూరి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమని కల్యాణ్ రామ్‌ను కోరారు. దానికి సమాధానంగానే కల్యాణ్ రామ్.. ఆటం బాంబ్ అని చెప్పాడట.
దీంతో జై ఎన్టీఆర్.. జై ఆటం బాంబ్ అని అక్కడి వారు నినాదాలు చేశారు. అయితే, అదే సమయంలో జూ.ఎన్టీఆర్‌ను ఒక అభిమాని లెజెండ్ అన్నాడు. దీంతో తన తమ్ముడిని అలా పిలవకూడదని లెజెండ్ అనే పదం పెద్దవాళ్లను ఉద్దేశించి వాడతారని, ఎన్టీఆర్ ఇంకా చిన్నవాడేనని కల్యాణ్ రామ్ సూచించారు.