బుల్లితెర నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య కేసుకు సంబంధించి గల్ఫ్‌లో పనిచేసిన శ్రవణ్ నాలుగు నెలల పాటు వారింట్లో ఉంటూ.. డైట్ కన్సల్టెంట్‌గా హైదరాబాదులో పనిచేస్తున్నాడని.. అతడి పాత్ర ఈ కేసులో ఎంతమాత్రమని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. ప్రదీప్ భార్య పావనిని ఇంకా విచారించలేదని సీఐ పి. రాంచందర్‌రావు వివరించారు.
ప్రదీప్ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని సీఐ అన్నారు. దర్యాప్తులో భాగంగా అందరి సెల్‌ఫోన్లు సీజ్‌చేసి కాల్ డాటా పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రదీప్ ఆత్మహత్యకు గల కారణాలు తెలిస్తే, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఎమైనా ఉంటే కేసులో చేరుస్తామని చెప్పారు.
ప్రదీప్ భార్య పావని, కుటుంబ స్నేహితుడు శ్రవణ్‌తో పాటు, బంధువులు, చుట్టుపక్కల వారిని, సహ నటీనటులనూ ప్రశ్నిస్తామని సీఐ చెప్పారు. వీరు కాకుండా ఈ కేసులో ఇంకెవరికైనా సంబంధం ఉందని తెలిసినా వారిని కూడా విచారిస్తామని సీఐ వెల్లడించారు.