అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

ఠాగూర్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (15:39 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మహిళా అఘోరి, వర్షిణి దంపతులు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తమ ఇద్దరిని అరెస్టు చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. తామిక తెలుగు రాష్ట్రాల్లో ఉండబోమని, అడుగుపెట్టబోమని, కేదార్నాథ్‌కు వెళ్లిపోతున్నామని, తమ శేషజీవితాన్ని అక్కడే కొనసాగిస్తామని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, అఘోరీ మొదటి భార్య తానే అంటూ ఇటీవల ఓ మహిళ హల్చల్ సృష్టించిన విషయం తెల్సిందే. తన మొదటి పెళ్లిపై అఘోరీ స్పందించారు. ఆ మహిళను మొదటి భర్త వదిలేయడంతో మానసిక ఒత్తిడిలోకి వెళ్లిందని అందుకే అలా పిచ్చిపచ్చి ప్రేలాపనలు పలుకుతున్నారని  అఘోరీ చెప్పుకొచ్చింది. పైగా ఆమెకు తాను తాళికట్టినట్టుగా ఆధారాలు ఉంటే చూపించాలని లేడీ అఘోరీ డిమాండ్ చేశారు. 
 

ఆత్మహత్య చేసుకుంటాం: అఘోరి, వర్షిణి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరి, వర్షిణి దంపతులు సంచలన ప్రకటన చేశారు. తామిద్దరిని అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. తామిక తెలుగు రాష్ట్రాలకు రామని,… https://t.co/U0GiJ6uWkE pic.twitter.com/YV09XYXVZn

— ChotaNews App (@ChotaNewsApp) April 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు