నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 22 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ఇప్పటికే 585 అడగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది.
ఎగువన కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.