2 నెలలుగా బాలికలపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి.. లైంగిక వేధింపులు..

బుధవారం, 11 జనవరి 2017 (19:41 IST)
బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. నందకుమార్‌ అనే వ్యక్తి ఆరుగురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పిడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన టీచర్లు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు నందకుమార్‌ను చితకబాదారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థినులు గిరకబావిగూడెం సుందరయ్య కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.
 
ఇదేవిధంగా ట్యూషన్‌కు వెళుతున్న ముగ్గురు చిన్నారులకు చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.  మదనాపురం మండలంలోని గోవిందహళ్లి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల ఇద్దరు బాలికలపై అదే గ్రామానికి చెందిన దాసరి శేఖర్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. రెండురోజులుగా ఆ ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ఎందుకు వెళ్లరంటూ ఆరా తీశారు. దీంతో జరిగిన సంఘటన ఆ తల్లిదండ్రులకు వివరించారు.
 
అదే గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడినికూడా లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ఈ ముగ్గురు చిన్నారులు ట్యూషన్‌కు వెడుతుండగా వారికి చాకెట్ల ఆశచూపి ఇంట్లోకి పిలిచిన శేఖర్ ఆ తరువాత అత్యాచారానికి పాల్పడిననట్లు డిఎస్‌పి చెన్నయ్య వివరించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు శేఖర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.

వెబ్దునియా పై చదవండి