తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రహీరోగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన అభిమానులతో పాటు యువతకు ఓ మంచి సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి చూస్తూ కాలం వృథా చేయకుండా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గుర్తింపు తెచ్చేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో అంధుల పాఠశాల, నవోదయ స్కూల్ తెచ్చిన ఘనత దివంగత ఎన్.టి.రామారావుకు చెందుతుందన్నారు.
ముఖ్యంగా, విద్యార్థులు చదువులపై దృష్టిసారించాలని కోరారు. సోషల్ మీడియా వైపు వెళ్లకుండా మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చూడాలని, ఫేస్‌బుక్ విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం మట్టితో అయినా ఒక్క గుంత పూడ్చిన పాపానపోలేదని ఆయన ఆరోపించారు.