నంద్యాల ఉప ఎన్నికలు చాలా వేడిగా వుండబోతున్నాయా... అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. ఇటీవలే బహిరంగ సభలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు అన్నీ మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచారనీ, హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదంటూ వ్యాఖ్యానించారు. దీనితో తెదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. ఈసీ దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి జగన్ మోహన్ రెడ్డి సంజాయిషీ కూడా ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే అఖిలప్రియ నడిరోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మొత్తమ్మీద జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యల ప్లానేంటో తెలియదు కానీ నంద్యాల ఎన్నిక మాత్రం హీటెక్కించేస్తుంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటు వేసి ప్రతి ఓటరు ఫోటోను తీస్తామంటూ ఈసీ ప్రకటించింది. ఈసీ ప్రకటనతోనే నంద్యాల ఎన్నిక ఎంత కట్టుదిట్టంగా జరుగబోతోందో అర్థమవుతుంది.