Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

దేవీ

బుధవారం, 6 ఆగస్టు 2025 (12:49 IST)
Chiranjeevi sppech
నేనంటే అబిమానించే వారికి ఏదైనా చేయాలనే ఆలోచన మనసులో తలస్తుండేది. ఫ్యాన్స్ ను వేరేవిధంగా మరింత పైకి ఎదిగేలా వాడుకుంటే అత్యంత శక్తివంచన లేకుండా చేద్దామనీ,  వారి తల్లిదండ్రులు ఆనందపడతారు. నేను కూడా సంత్రుప్తి చెందుతాను అనే కోణంలోనే బ్లడ్ బ్లాంక్ నెలకొల్పడానికి స్పూర్తినిచ్చింది. వారి ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోగలుగుతానని ఇది దేవుడు నాకిచ్చిన అవకాశం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
 
బుధవారంనాడు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేను రాజకీయాలకు దూరంగా వున్నా. అయినా నాపై నిందలు వేస్తున్నారు. ఈమధ్య నాకు అత్యంత దగ్గరగా మనస్సుకు హత్తుకున్న ఓ సంఘటన జరిగింది. ఓ పొలిటీషియన్ నన్ను అకారణంగా నా గురించి అవాకులు, చవాలు పేలారు. ఆ తర్వాత ఆ పొలిటీషియన్ ఓ గ్రామానికి వెళితే అక్కడ ఓ మహిళ చిరంజీవిగారిని మీరు తిడతారా? అంటూ.. ఆయన్ను నిలదీసింది. అసలు ఆవిడ ఎవరో నాకు తెలీదు. నా అభిమాని మాత్రం కాదు. అందుకే ఆమె గురించి తెలిసి నా టీమ్ ను పంపించాను. వారు తీసిన వీడియోలో ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. మీకు చిరంజీవి ఏమైనా సాయం చేశారా? అని అడిగితే.. చేయడం ఏమిటండీ.. నా బిడ్డ ప్రాణం కాపాడాడు అంటూ చెప్పింది.
 
అదెలా గంటే, డెంగ్యూ వచ్చి నా పిల్లాడికి ప్లే లెట్స్ డౌన్ అయ్యాయి. అప్పుడు రక్తం కావాలి. ఇక్కడ బ్లడ్ దొరకదని డాక్టర్లు చెప్పారు. లేట్ అయితే బతకరు అన్నారు. అలా  బాధపడుతుండగా. ఎవరో ఒకరు ఇచ్చిన సలహాతో అనుమానంగా హైదరాబాద్ లో వున్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆఫీసుకు ఫోన్ చేశా. వెంటనే బ్లడ్ బ్యాంక్ టీమ్ ఫోన్ కు బదులిచ్చారు. హైదరాబాద్ లో వున్న వారు ఎలా ఇక్కడకు వస్తారని నాకు అనుమానంగా వుంది అని ఆమె చెప్పిందట. ఈ వార్త విన్నవెంటనే రాజమండ్రిలో మారుమూల గ్రామానికి నా అభిమానులు వెళ్లి అక్కడ 8 సంవత్సరాల పిల్లాడికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడారట. అది ఆ మహిళ చెబుతుంటే నా కళ్ళు చెమర్చాయి. 
 
ఇది కదా అభిమానం. గౌరవం అంటే ఇదంతా దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. అలాంటి వ్యక్తిని తిడతావా? అంటూ ఆ పొలిటీషియన్ ను నిలదీసింది. ఆ తర్వాత ఆ పొలిటీషియన్ మరలా నా గురించి మాట్లాడింది లేదు. ఎందుకంటే ఆయనకూ ఓ మనసుంటుంది. తప్పుచేశాననే భావన కలిగి వుంటుంది. ఎలాగూ ఇంటికి వెళితే ఇంటిలో మహిళలు కూడా ఎదురుతిరిగుంటారు. ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అని అన్నారు.
 
బుధవారంనాడు హైదరాాబాద్ లో చుక్కలపల్లి శంకరరావు వందవ జయంతి సందర్భంగా వారి వారసులు హైదరాబాద్ హైటెక్స్ లోని ఫోనిక్స్ కంపెనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు