కేంద్ర బడ్జెట్ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆయన కోడలు, హెరిటేజ్ డైరెక్టర్ నారా బ్రహ్మిణి మాత్రం కేంద్ర బడ్జెట్ పైన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగవ బడ్జెట్లో మత్య్సకారులు, పాడి పరిశ్రమలకు చెందిన వారికి, ఆక్వా రైతులకు ఎంతగానో ఉపయోగపడనుందని, ఇది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.
కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా మిగిలినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, 10 వేల కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి పాడి, మత్స్య పరిశ్రమలకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు బ్రహ్మిణి. రైతులకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉన్నా సరే మిగిలిన విషయాల్లో అన్యాయం జరిగిందన్న విషయం నారా బ్రహ్మిణికి తెలియలేదా అని చెవులు కొరుక్కుంటున్నారు టిడిపి నేతలు.