మనకు చక్రం తిప్పడం కొత్తేం కాదు : నారా లోకేష్

బుధవారం, 23 మే 2018 (21:27 IST)
విభజన జరిగాక విజయవాడలో తొలిసారిగా జరుగుతున్న మహానాడు విజయవంతం చేయాలని లోకేష్ కార్యకర్తలకు పిలుపు యిచ్చారు. తను ఆరు మహానాడులు చూశాను.. ప్రతి మహానాడులోనూ వర్షం కురుస్తుంది. అది శుభసూచకమని తెలిపారు. చంద్రబాబు గర్వపడే విధంగా ఈ మహానాడు నిర్వహించుకుందాం అన్నారు.
 
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పడం కొత్తేంకాదు అని గతంలో వివిధ సందర్భాల్లో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులోనూ చక్రం తిప్పి కీలకపాత్ర పోషిస్తాం అని తెలియజేశారు. బీజేపీని ఓడించాలని కర్ణాటక ఎన్నికల్లో పిలుపిచ్చాం.. అందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుందామని అన్నారు లోకేష్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు