మెగా పవర్ స్టార్‌ చెర్రీపై ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం.. ఎందుకు?

సోమవారం, 30 ఏప్రియల్ 2018 (11:09 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులు తిలకించారు. తాజాగా రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తిలకించారు.
 
ఆ తర్వాత చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "థమ్స్ అప్ టూ రామ్ చరణ్, సుకుమార్ మరియు వారి చిత్రబృందం. 'రంగస్థలం' వంటి వండర్ ఫుల్ చిత్రాన్ని అందించారు. సినిమా చూసిన తర్వాత కూడా చిత్రంలోని పాత్రలు నాతోనే వచ్చేశాయి. గ్రేట్ వర్క్ గైస్" అంటూ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
 

Thumbs up to Ram Charan, Sukumar & team for giving us a wonderful film like #Rangasthalam to watch. The characters stay with us after the movie was long over! Great work guys!!

— Lokesh Nara (@naralokesh) April 29, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు