కాట్రగడ్డ నాగమల్లేశ్వర బాబు హఠాన్మరణం

ఆదివారం, 24 అక్టోబరు 2021 (09:38 IST)
తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ నాగమల్లేశ్వర రావు (బాబు) హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. విజయవాడ లబ్బీపేటలోని తన నివాసంలో ఆయన గుండెపోటుకుగురికాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాట్రగడ్డ బాబు మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.
 
కాట్రగడ్డ నాగమల్లేశ్వర రావు ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన నేతను కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. ఆయన అకాల మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు