నేటి నుంచి మరో జీవితం మొదలైందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎమ్మెల్సీ కోటాలో చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మామ నటి బాలకృష్ణ వెంట రాగా, ఆయన తన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ స్వీట్ చేశారు. తాను నామినేషన్ దాఖలు చేశానని, ఈ సందర్భంగా తనతో పాటు అసెంబ్లీకి వచ్చి మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలని, ఈ సమయం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మరో జీవితం మొదలైందని, ప్రజా ప్రతినిధిగా, రాష్ట్రాభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ విస్తరణకు తనవంతు కృషి చేస్తానని ఆయన రేలిపారు.