కరెంట్ కోతలు వుండడం వాస్తవం కూడా.. అయితే దీనిపై నారా లోకేశ్, ప్రభుత్వంపై ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ ఫ్యాన్ గుర్తును బ్రతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు.
బయట చూస్తే ప్రజలంతా రావాలి కరెంట్, కావాలి కరెంట్ అని మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తునీ బతిమిలాడుకుంటున్నారు.
మీరు కాస్త చీకట్లోంచి బయటకు వచ్చి
ప్రజలకు కరెంట్ ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరి ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వేసిన లోకేష్ సెటైర్‌కు వైసిపి ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది చూడాలి.