ఇప్పటికే పొలిట్‌బ్యూరో మీటింగ్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేష్ కుమారుడికి మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. నారాలోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే ఆ పదవికి సరైన న్యాయం చేస్తారని పార్టీ నేతలే ఇప్పటికీ ప్రకటనలు కూడా చేసేశారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక లోకేష్ బాబుకు శాఖలను కేటాయించడమే తర్వాత. అయితే లోకేష్‌కు ఇప్పటికే కొన్ని శాఖలను బాబు కేటాయించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అవే ఐటీ, పురపాలక శాఖలు.
ఈ రెండు శాఖలు గతంలో ఇద్దరు మంత్రులు దగ్గర ఉన్నాయి. ఐటీ శాఖ పల్లెరఘునాథ్ రెడ్డి, రెండవ శాఖ పురపాలక నారాయణ వద్ద ఉన్నాయి. ఈ రెండింటిని వారి నుంచి లాక్కుని లోకేష్ బాబుకు చంద్రబాబు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ శాఖలను వదిలేయాలని ఇద్దరు మంత్రులను బాబు సూచించినట్టు సమాచారం.
మరోవైపు ఏపీలో త్వరలో మున్సిపల్, నగర పాలిక ఎన్నికలో జరుగనుండటంతో ఆ శాఖను లోకేష్ బాబుకు అప్పజెబితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది బాబు ఉద్దేశం. అందుకే ప్రస్తుతం ఆ శాఖలను లోకేష్‌కు అప్పజెప్పనున్నారట. అధినేత శాఖలను ఇచ్చేయ్యమంటే ఇవ్వకుండా ఉంటారా.. ఆ శాఖలను ఇవ్వడానికి ఇద్దరు మంత్రులు సిద్ధమయ్యారట.